Newzealand: భారత్ కు బయలుదేరిన ననాయా మహుతా....

భారత్ కు విచ్చేయనున్న న్యూజిలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రి...

Update: 2023-02-06 08:01 GMT

న్యూజిలాండ్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ననాయా మహువా భారత్ పర్యటన నిమిత్తం బయలుదేరారు. ప్రపంచంతో అతేరువా న్యూజిలాండ్ సంబంధాలు పునరుత్తేజపరచాలన్న సంకల్పంతో అన్నీ దేశాలూ పర్యటిస్తోన్న ననాయా ఫిబ్రవరి 12 వరకూ భారత్ లో గడపనున్నారు. న్యూఢిల్లీలో నుంచి ఆమె పర్యాటన అధికారికంగా ప్రారంభమవ్వనుంది. ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కర్ తో  పాటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, గిరిజన శాఖా మంత్రి అర్జున్ ముండాతో భేటీ అవ్వనున్నారు. అనంతరం న్యూజిలాండ్ విద్యా, వాణిద్య, పర్యాటక రంగాల గురించి భారత వాణిద్య రాజధాని ముంబైలో ప్రచారం చేయనున్నారు. అంతర్జాతీయ సహచరులతో సత్సంబంధాలు నెలకొల్పడమే ఈ పర్యటన ప్రధాన ఎజెండా అని ననాయా పేర్కొన్నారు. అతేరువా న్యూజిలాండ్ -భారత్ నడుమ అత్యంత చైతన్యవంతమైన సబంధాలు ఉన్నాయని ఆమె తెలిపారు. రెండు లక్షలా నలభై వేల మంది భారతీయులు న్యూజిలాండ్ తమ సొంత ఊరు అని సంబోధిస్తున్నారు అంటే... ఇరు దేశాల మనుషుల మధ్యా ఎంతటి గాఢమైన అనుబంధం పెనవేసుకుందో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఇరు దేశాలూ పసిఫిక్ ప్రాంతంపై తమకున్న ఆలోచనలను పరస్పరం గౌరవించుకుంటాయని, ఈ పర్యటనలో పర్యావరణ పరిరక్షణకై కలసి పనిచేసేందుకు సమాలోచనలు చేయనున్నట్లు వెల్లడించారు.  



Tags:    

Similar News