బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్?
బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.;
బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో చేరేవారు ప్రతీ ఎనిమిది రోజులకు రెండింతలు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోసారి లాక్‌డౌన్ తప్పదని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. నిజానికి లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని.. అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మట్ హ్యాన్‌కాక్ తెలిపారు.
యూరప్ దేశాల్లో బ్రిటన్‌పైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపించింది. అక్కడ 42 వేల మంది ఈ మహమ్మారికి బలైయ్యారు. ఈ మధ్య కరోనా కేసులు తగ్గినా.. మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందిన వైద్య నిపుణలు అంటున్నారు. అక్టోబర్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధించడం ద్వారా కరోనాకు ముకుతాడు వేయవచ్చని అభిప్రాయపడ్డారు.