మత్స్యకారుని వలలో చిక్కిన అరుదైన చేపలు.. కిలో రూ.70 లక్షలు
అరుదైన చేపలను విక్రయించిన పాక్ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.
పేద ఇబ్రహీం హైదరీ మత్స్యకార గ్రామం హాజీ బలోచ్ లో నివసిస్తున్నాడు. తన తోటి మత్స్యకారులతో కలిసి అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అక్కడ అరుదైన చేపలు చిక్కాయి వారి వలకు. స్థానిక భాషలో "సోవా" అని పిలిచే చేపలను పట్టుకున్నారు. ఈ చేపలలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని విని ఉన్నారు.
"శుక్రవారం ఉదయం కరాచీ నౌకాశ్రయంలో మత్స్యకారులు తాము పట్టుకున్న చేపలను వేలం వేయగా మొత్తం చేపలు దాదాపు 70 లక్షల రూపాయలకు విక్రయించబడ్డాయి" అని పాకిస్తాన్ ఫిషర్మెన్ ఫోక్ ఫోరమ్‌కు చెందిన ముబారక్ ఖాన్ తెలిపారు. సోవా చేప అమూల్యమైనది మరియు అరుదైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దాని బొడ్డు నుండి వచ్చే పదార్థాలు గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చేపల నుండి దారం లాంటి పదార్థాన్ని శస్త్రచికిత్సా విధానాలలో కూడా ఉపయోగిస్తారు.
"ఒక చేప వేలంలో సుమారు 7 మిలియన్ రూపాయలు పలికింది" అని బలోచ్ చెప్పారు. తరచుగా 20 నుండి 40 కిలోల బరువు, 1.5 మీటర్ల వరకు పెరిగే ఈ చేప తూర్పు ఆసియా దేశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది
"మేము కరాచీలోని సముద్రంలో చేపలు పట్టడం చేస్తుంటాము. ఈ భారీ చేపను చూసినప్పుడు మా ప్రాణం గాల్లో తేలినట్లైందని చెప్పాడు. మా కష్టానకి ఇన్ని రోజులకు ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు.
ఆ డబ్బును తన తోటి మత్స్యకారులతో కలిసి పంచుకుంటానని హాజీ చెప్పాడు.సంతానోత్పత్తి కాలంలో మాత్రమే చేపలు తీరానికి చేరుకుంటాయి.