Pakistan : గుణపాఠం నేర్చుకున్నాం; భారత్ తో చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని

భారత్ తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమని పిలుపునిచ్చిన పాక్ ప్రధాని;

Update: 2023-01-17 12:49 GMT

భారత్ తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్  గుణపాఠం నేర్చుకుందని అన్నారు పాక్ ప్రధాని షేహబాజ్ షరీఫ్. దుబాయ్ లో ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ మాట్లాడుతూ... భారత్ తో పాక్ చేసిన మూడు యుద్ధాల పర్యావసానం పాక్ ప్రజలకు నిరుద్యోగాన్ని, కష్టాలను, పేదరికాన్ని తీసుకువచ్చాయని అన్నారు. తాము తప్పులను తెలుసుకుని గుణపాఠం నేర్చుకున్నామని తెలిపారు. భారతదేశంతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నామని అన్నారు.

కశ్మీర్ పై భారత ప్రధాని మోడీతో చర్చలు జరిపేందుకు సిద్ధమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. "ప్రధాని మోడీకి, భారత నాయకత్వానికి తానిచ్చే  సందేశం ఏమిటంటే.. కశ్మీర్ లాంటి బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి గంభీరమైన చర్యలు జరుపుదామని చెప్పారు. ఒకరికి ఒకరం గొడవలు పడకుండా శాంతి యుతంగా జీవిద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల్లో నిపుణులైన ఇంజనీర్లు, వైద్యులు ఉన్నారని, వారిని భారత్, పాకిస్థాన్ ల అభివృద్ధికై ఉపయోగించుకునే అవసరం రెండు ప్రభుత్వాలకు ఉందని అన్నారు.

బాంబులను, మందుగుండు సామాగ్రికోసం పాకిస్థాన్ తన వనరులను వృధా చేయకూడదని నిర్ణయించుకుందని షరీఫ్ తెలిపారు. తాము అణ్వాయుధాలను కలిగి ఉన్నామని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని పాక్ లేవనెత్తినందుకు భారతదేశం పాక్ పై విరుచుకుపడిందని తెలిపారు. కశ్మీర్ అంశంపై భారత్ తో చర్యలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు. జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో అన్నారు.

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుంది. పిండి, నిత్యావసర వస్తువులు లేక, ప్రభుత్వం ఇచ్చే పిండి కోసం అక్కడి ప్రజలు ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు. పిండి లారీని బైకులతో చేజ్ చేసి మరీ పిండిని దొంగలించే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News