Pakistan Elections : జనవరిలో సార్వత్రిక ఎన్నికలు..

సంక్షోభ పాకిస్తాన్‌లో మోగిన ఎన్నికల నగారా..;

Update: 2023-09-22 01:45 GMT

 పాకిస్థాన్ ఎన్నికల సంఘం గురువారం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించబడుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం నియోజకవర్గాల విభజనపై పనిని సమీక్షించిందని మరియు నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం ప్రాథమిక జాబితాను సెప్టెంబర్ 27 న ప్రచురించాలని నిర్ణయించినట్లు పాక్ వార్తా  సంస్థ డాన్ నివేదించింది.

వచ్చే ఏడాది మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ ,మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అయితే  ఇంతకంటే ముందే అంటే జనవరి చివరి వారంలో పాకిస్తాన్‌లోనూ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ ఓ కథనంలో 2024 జనవరి చివరి వారంలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించినట్టు రిపోర్ట్ చేసింది. నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణను సమీకరించిన తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తామని వివరించింది. నవంబర్ 30వ తేదీన నియోజకవర్గాల తుది జాబితాు విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత 54 రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్‌కు అవకాశం ఇస్తామని వివరించింది. అనంతరం, జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై చర్చించడానికి వచ్చే నెలలో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని షెడ్యూల్ చేసినట్లు ఎన్నికల సంఘం చెప్పిన దాదాపు 24 గంటల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.


ఈసీపీ ప్రకారం.. షెడ్యూలును ఖరారు చేయడానికి ముందు ప్రవర్తనా నియమావళి ముసాయిదాను రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు ఎలాంటి అభిప్రాయాన్ని ప్రచారం చేయరాదని రాజకీయ పార్టీలకు సూచించారు. పాకిస్తాన్ భావజాలానికి లేదా పాకిస్తాన్ సార్వభౌమత్వం, సమగ్రత లేదా భద్రత లేదా నైతికత లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదని ముసాయిదా కోడ్ పేర్కొంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లు ఉన్నాయి.వీటిలో 272 సీట్లకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. 60 సీట్లు మహిళలకు మరియు పది మతపరమైన మైనారిటీలకు రిజర్వు చేయబడ్డాయి. 

పాలక పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ యొక్క పిటిఐ పార్టీ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ పై నేరారోపణను రద్దు చేస్తే తప్ప ఇతను స్వయంగా ఎన్నికల్లో పాల్గొనలేరు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం, నేరారోపణలు ఉన్న ఎవరూ పార్టీకి నాయకత్వం వహించలేరు. ఎన్నికల్లో పోటీ చేయలేరు మరియు ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహించలేరు.  

Tags:    

Similar News