Justice Ayesha Malik : పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారి.. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా...!
Justice Ayesha Malik : ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.;
Justice Ayesha Malik : ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్ (జెసిపి) గురువారం ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్ అయేషా మాలిక్‌ను ఆమోదించింది.
జస్టిస్ అయేషా మాలిక్ హార్వర్డ్ లా స్కూల్ నుండి LLM పట్టభద్రురాలు. ఆమె 1997-2001 వరకు న్యాయవాదిగా పనిచేయగా, 2012 నుంచి లాహోర్ హైకోర్టు జడ్జీగా పనిచేశారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో జస్టిస్ ఆయేషా మాలిక్ చారిత్రక తీర్పులు ఇచ్చారు. అయేషా వయసు 55 ఏళ్లు కాగా ఆమె 1966లో జన్మించారు.