చైనా వైద్యులు అరుదైన ఆపరేషను విజయవంతం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి శరీరంలో పంది కాలేయాన్ని అమర్చారు. భవిష్యత్ లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. మానవ శరీరంలోకి సరిపోయేలా జన్యు సవరణలు చేసిన ఓపంది కాలేయాన్ని వైద్యులు సేకరించారు. బ్రెయిన్ డెడ్ అయిన మానవ శరీరంలోకి దాన్ని మార్పిడి చేశారు. గతంలోనూ అమెరికా వైద్యులు పంది మూత్రపిండాలు, గుండెను విజయవంతంగా అమర్చారు. కాలేయ దాతలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, చైనా వైద్యుల ప్రయోగం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సాధారణంగా జన్యు సవరణలు చేసిన పందుల అవయవాలను, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి వినియోగిస్తారు. కాలేయం దాత దొరికేదాకా సదరు రోగికి పంది కాలేయం సేవలు అందిస్తుంది.