పాకిస్థాన్‌లో మరో విమాన ప్రమాదం

పాకిస్థాన్‌లో తరచూ విమాన ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానం

Update: 2020-09-15 11:37 GMT

పాకిస్థాన్‌లో తరచూ విమాన ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానం అట్టాక్ ప్రాంతంలో కుప్పకూలింది. రోజువారీ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని.. అయితే ప్రాణనష్టం ఏమీ జరగలేదని పాకిస్తాన్ మీడియా తెలిపింది. పాక్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ ప్రమాదం జరిగినట్టు ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిందని.. అయితే, చాకచక్యంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని పాక్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. దీనిపై దర్యాప్తునకు బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టిందని తెలిపింది. ఈ ఏడాదిలో మొత్తం 5 ఘటనలు చోటుచేసుకున్నాయి. 

Tags:    

Similar News