కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. టొరంటోలోని పియర్సన్ ఎయిర్‌పోర్ట్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం క్రాష్ లాండ్ అయింది. బలమైన గాలుల కారణంగా విమానం ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి ఏకంగా తలకిందులైంది. ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినపుడు విమానంలో 80 మంది ఉన్నారు. మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌లో ధృవీకరించింది. విమానం తిరగబడి ఎయిర్‌పోర్టులో పడి ఉన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరల్లోనే దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.