Plane Crash Video: నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రతికూల వాతావరణ పరిస్థితే కారణం
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు విమానం స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో మాజీ NASCAR డ్రైవర్ గ్రెగ్ బిఫిల్ (55), అతని భార్య క్రిస్టినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల కుమార్తె ఎమ్మా, ఐదేళ్ల కుమారుడు రైడర్‌గా గుర్తించారు.
ప్రమాదానికి కారణమిదే..
విమానం బయల్దేరే సమయంలోనే వాతావరణం అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. స్టేట్స్‌విల్లే విమానాశ్రయం చుట్టూ వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. అయినా కూడా విమాన ప్రయాణం ప్రారంభించినట్లు నివేదిక అందుతోంది. విమానం టేకాఫ్ అయిన 10:00 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై వర్షం పడిందని అక్యూవెదర్ డేటా చూపించింది. బయలుదేరిన 15 నిమిషాల్లోనే విమానం విమానాశ్రయానికి తిరిగి రావడానికి ప్రయత్నించి. 10:15 గంటల ప్రాంతంలో రన్‌వేపై కూలిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే కూలిపోయిన విమానం బిఫిల్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. NASCAR బృందాలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలు తరచుగా ఉపయోగించే విమానాశ్రయంలోనే విమానం కూలిపోయింది. బిఫిల్ కుటుంబ సభ్యులంతా చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. ఈ విమానం బిఫిల్‌కు సంబంధించిన ఓ కంపెనీ పేరుపై రిజిస్టర్ అయ్యిందని రాయిటర్స్ పేర్కొంది. మృతుల్లో గ్రెగ్ బిఫిల్, అతని భార్య క్రిస్టినా బిఫిల్, ఐదేళ్ల కొడుకు, రైడర్, గ్రెగ్ కూతురు ఎమ్మాతో వారితో పాటు డెన్నిస్, అతని కొడుకు జాక్, క్రెయిగ్ వాడ్స్‌వర్త్ ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై ఎఫ్‌ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి.