క్వాల్కమ్ అధినేత క్రిస్టినో ఆర్.ఎమోన్‌తో మోదీ భేటీ..!
అమెరికా పర్యటనంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ క్వాల్‌కామ్ అధినేత, సీఈవో క్రిస్టినో ఆర్.ఎమోన్ తో సమావేశమయ్యారు.;
అమెరికా పర్యటనంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ క్వాల్‌కామ్ అధినేత, సీఈవో క్రిస్టినో ఆర్.ఎమోన్ తో సమావేశమయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో క్రిస్టినో బృందం, సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారత్‌లో్ ప్రవేశపెట్టబోయే 5జీ నెట్ వర్క్ గురించి చర్చించారు. దేశంలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు మీటింగ్ అనంతరం క్రిస్టినో ట్వీట్ చేశారు.