US Politics : వైట్ హౌస్లోకి ట్రంప్ కు ఆహ్వానం .. స్వయంగా పిలిచిన అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. బైడెన్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. అనంతరం "వైట్ హౌస్లోలో తనను కలవాలని అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంపు బైడెన్ ఆహ్వానించారు. తర్వలో వైట్ హౌస్ సిబ్బంది అందుకు సంబంధించిన షెడ్యూల్ రూపొందిస్తారు. ఎన్నికల సరళి, ఎన్ని కల ఫలితాలు గురించి చర్చించడంతో పాటు దేశాన్ని ఉద్దేశించి జో బైడెన్ ఇవాళ ప్రసంగి స్తారు, ”అని వైట్ హౌస్ తెలిపింది. ఈ మేరకు ట్రంప్ వర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. "అధ్య క్షుడు జో బైడెన్ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ విజయంపై అభినందించేందుకు పిలిచారు. ప్రస్తుత పరిపాలన, ఇన్కమింగ్ అడ్మి నిస్ట్రేషన్ సజావుగా మారేలా చూడటానికి వైట్ హౌస్కు రావాలని ఆహ్వానం పంపారు. ట్రంప్ త్వరలో జరగబోయే సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు” అని ట్రంప్ ప్రచార కమ్యూనికేష న్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ అన్నారు.