జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లిన ప్రధాని మోడీకి రియో డి జెనెరో నగరంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయులు సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. బ్రేజిల్‌లో మోదీకి వేద పఠనంతో పండితులు ఆశీర్వదించారు. జీ20 సమావేశంలో ప్రపంచ నేతలతో ఫలవంతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో జరిగే 19వ జీ20 సదస్సులో ట్రోకా సభ్యునిగా ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇవాళ , రేపు జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే నాయకులలో ప్రధాని మోడీతో పాటు, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. ఇక ఆఖర్లో అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ నవంబర్ 19 నుంచి 21 వరకు గయానాలో పర్యటించనున్నారు. దీంతో 50 ఏళ్ల తర్వాత గయానాలో పర్యటించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డులకెక్కనున్నారు.