CJI Chandrachud: మహిళల పట్ల మన ఆలోచన విధానం మారాలన్న సీజేఐ

లింగ అసమానతలపై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు

Update: 2023-12-18 00:45 GMT

లింగ అసమానతలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలో కొనసాగుతున్న లింగ అసమానతలను చట్టం ఎందుకు పరిష్కరించాల్సిన అవసరం ఉందో వివరించిన ఆయన.. గోప్యత అనేది హక్కుల ఉల్లంఘనకు దాపరికం కాదని అభిప్రాయపడ్డారు. భారత 19వ ప్రధాన న్యాయమూర్తి ఈఎస్ వెంకటరామయ్య స్మారకార్థం బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్‌ వెంకటరామయ్య కుమార్తె జస్టిస్‌ బీవీ నాగరత్న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారని.. దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రదేశాలలో వ్యక్తులను రక్షించేందుకు చట్టం ఉద్దేశ్యాన్ని విస్తరించాలన్నారు. లింగ వివక్షను పబ్లిక్‌, ప్రయివేట్ అనే విభజన కోణంలో చూస్తామని.. భారతీయ శిక్షాస్మృతిలో ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గొడవకు దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. నేరం చేసినట్లు చెప్పాలనే నిబంధన ఉందని ఆయన అన్నారు.

బహిరంగ ప్రదేశమైతే మాత్రమే శిక్షార్హమైందని.. లేదంటే శిక్షానర్హుడన్నారు. అందువల్ల చట్టం సారాంశం ఘర్షణల స్వాభావిక యోగ్యత లేదంటే.. నేరం మాత్రమే కాదు అది ఎక్కడ జరుగుతోంది.. సమగ్రమైన, రాజ్యాంగబద్ధంగా పాలించే సమాజం పబ్లిక్, ప్రైవేటు అనే కోణాన్ని దాటి చూడాలని సీజేఐ అన్నారు. చాలా ఏళ్లుగా పబ్లిక్, ప్రైవేట్ అనే ఈ భావన మన చట్టాలపై స్త్రీవాద, ఆర్థిక విమర్శలకు ఆధారమని.. వాక్‌ స్వాతంత్య్రం నిజంగా ఉనికిలో ఉండాలంటే ఈ రెండు ప్రదేశాల్లో అది ఉనికిలో ఉండాలని వ్యాఖ్యానించారు.

గృహిణి తన సేవకు వేతనం పొందని ప్రైవేట్ స్థలం అది ఇల్లు అని.. ఆర్థిక కార్యకలాపాలకు నియలమని సీజేఐ అన్నారు. దేశంలో లింగ వేతన వ్యత్యాసం సీజేఐ స్పందిస్తూ.. ఈ సమస్య ముఖ్యంగా భారతీయ మహిళలకు, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు చెందిన వారికి ఆపాదిస్తారన్నారు. వివిధ వృత్తిపరమైన రంగాల్లో మహిళలు గణనీయమైన కృషి చేసినప్పటికీ పురుషులతో పోలిస్తే వేతనాల్లో అసమానతను ఎదుర్కొంటున్నారని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News