Scream Artist Ashley Peldon: అరుపులే ఉద్యోగం.. కోట్లలో ఆదాయం

Scream Artist Ashley Peldon: ఏ పనీ రాదని చేతులు ముందు పెట్టి కూర్చోకూడదు.. ఏదో ఒకటి చేయాలి కానీ ఎవరినీ యాచించకూడదు.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది.. దానిని గుర్తించి పదును పెట్టాలి. అదే మీకు అవకాశాలు తెచ్చిపెడుతుంది.

Update: 2022-06-24 07:47 GMT

Scream Artist Ashley Peldon: ఏ పనీ రాదని చేతులు ముందు పెట్టి కూర్చోకూడదు.. ఏదో ఒకటి చేయాలి కానీ ఎవరినీ యాచించకూడదు.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది.. దానిని గుర్తించి పదును పెట్టాలి. అదే మీకు అవకాశాలు తెచ్చిపెడుతుంది.

ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలు.. మనలో ఆ టాలెంట్ ఉందని తెలుసుకోవడం ముఖ్యం.. దానికి పదును పెడితే కాసుల వర్షం కురుస్తుంది.. ఇంటీరియర్ డిజైనర్లు, ఈవెంట్ మ్యానేజర్లు ఇంతకు ముందు ఉన్నారా.. ఇప్పుడవే హై పెయిడ్ జాబులయిపోయాయి. అవే కాదండోయ్ అరిచి కూడా బాగా సంపాదించొచ్చంటోంది న్యూయార్క్ కి చెందిన యాష్లీ పెల్డన్.

హాలీవుడ్ చిత్రాలు హారర్ మూవీస్ కి పెట్టింది పేరు. అందులో వచ్చే భయంకరమైన అరుపులు ప్రేక్షకుడిని భయభ్రాంతులకు గురిచేస్తాయి.. మరి ఆ భయంకరమైన అరుపులకు స్పెషల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లు ఉంటారు.. అందులో యాష్లీ ఒకరు. ఆమె అరుస్తూ డబ్బు సంపాదిస్తుంది.

ఆమె ప్రొఫెషనల్ స్క్రీమ్ ఆర్టిస్ట్. హారర్ చిత్రాలకు వాయిస్ రికార్డ్ చేస్తుంది. ఇలాంటి కళాకారులు మైక్ ముందు రకరకాల శబ్దాలు చేయడంలో నిష్ణాతులు. వాటిని సినిమాల్లో వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తారు.

ఏడేళ్ల వయసులో తన ప్రతిభ గురించి తనకు తెలిసిందని యాష్లే చెప్పింది. ఆ సమయంలో ఆమెకు 'చైల్డ్ ఆఫ్ యాంగర్' అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో కేకలు వేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మొదటి సినిమాతోనే తనలో ఉన్న ప్రతిభ బయటపడింది.. అదే మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక దానినే కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. 25 సంవత్సరాలుగా ఈ వృత్తితో అనుబంధం ఉన్న యాష్లీ ఇప్పటి వరకు 40కి పైగా సినిమాలు చేసింది.

సినిమాలతో పాటు టీవీ సిరీస్‌లకు కూడా తన గాత్రాన్ని అందించింది. ఇందుకోసం తాను ఎలాంటి ప్రాక్టీస్ చేయనని, అది సహజంగానే వస్తుందని చెప్పింది. ఒక్కోసారి ఎనిమిది గంటల పాటు అరవాల్సి వస్తుంది. దాంతో చాలా అలసిపోతుంటాను. అయినా ఇష్టపడి చేస్తున్నందున తన వృత్తి పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది యాష్లే.

స్క్రీమ్ ఆర్టిస్ట్ ఉద్యోగం స్టంట్ మాస్టర్ ఉద్యోగంతో సమానంగా ఉంటుంది. వాళ్లు ఫైట్లు చేసి కష్టపడితే తాము అరిచి కష్టపడతామని వివరించింది. 2015లో వచ్చిన జురాసిక్ పార్క్ సినిమా కోసం పని చేసినప్పుడు అందులో డైనోసార్‌లు దాడి చేస్తున్నప్పుడు, ప్రజలు భయంతో అరుస్తూ, పడుతూ లేస్తూ పరిగెడుతుంటారు. పాత్రల స్వభావానికి తగ్గట్టుగా గొంతులో స్వరాన్ని పలికించాల్సి ఉంటుంది. తాజాగా ఫ్రీ గై, పారానార్మల్ యాక్టివిటీ, స్క్రీమ్ వంటి భారీ చిత్రాల కోసం యాష్లే తన అరుపులను అందించింది.

Tags:    

Similar News