Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. కొన్ని గంటల్లోనే టిబెట్‌లో కూడా 4.3 తీవ్రతతో..
ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వర్షాలు, వరదలు, భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ మధ్య తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉన్నపళంగా భవనాలు కుప్పకూలుతున్నాయి. పరిమితంగా ప్రాణనష్టం, భారీగా ఆస్థినష్టం సంభవిస్తోంది.;
రష్యాతో పాటు అనేక ఇతర దేశాలను 8.8 తీవ్రతతో కుదిపేసిన భారీ భూకంపం తర్వాత టిబెట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వర్షాలు, వరదలు, భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ మధ్య తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉన్నపళంగా భవనాలు కుప్పకూలుతున్నాయి. పరిమితంగా ప్రాణనష్టం, భారీగా ఆస్థినష్టం సంభవిస్తోంది.
భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకటన ప్రకారం, టిబెట్ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది , దీని వలన అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంది.
రష్యాలో భారీ ప్రకంపనలు సంభవించాయి. జపాన్‌తో సహా అనేక చోట్ల ప్రకంపనలు సంభవించిన వెంటనే, టిబెట్‌లో ఈరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 6:58 గంటలకు భూకంపం సంభవించింది.
మూడు రోజుల్లో రెండో భూకంపం
టిబెట్‌లో మూడు రోజుల క్రితమే భూకంపం సంభవించింది. వారంలోనే ఇది రెండోసారి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను హెచ్చరిస్తున్నారు.