Brain Chip: డ్రిల్లింగ్ మిషిన్‌తో తలకి స్వయంగా సర్జరీ... ఎందుకంటే..

బ్రెయిన్‌లో చిప్ పెట్టుకొనే ప్రయత్నంలో చావు అంచులవరకు ప్రయాణం

Update: 2023-07-24 09:30 GMT

ఎవరైనా అర్థం పర్ధం లేని పనులు చేస్తే వాళ్ళని మనం కామన్ గా బ్రెయిన్ లేదు, చిప్ పోయింది ఇలా తిడతాం. కానీ నిజంగా బ్రెయిన్ లో చిప్ పెట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళని మీరు చూశారా. ప్రపంచంలో అందరికంటే ముందు ఒక బ్రెయిన్ చిప్‌ని తన మెదడులో అమర్చుకోవాలని ఒక వ్యక్తి ప్రయత్నించాడు.కానీ ఆ ప్రయత్నం బ్యాక్ ఫైర్ అయింది. అయితే ఎలాగో ఒకలా బతికాడు..వివరాలలోకి వెళితే


రష్యాకు చెందిన 40 ఏళ్ల మిఖాయిల్‌ అనే వ్యక్తి కజకిస్థాన్‌లో నివసిస్తున్నాడు. తనకు నిద్రలో వచ్చే కలలను నియంత్రించాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఇంటర్నెట్‌లో చాలా సమాచారం సేకరించాడు. తన తలలో ఒక చీప్ పెట్టుకొని కలలను నియంత్రించుకుందాం డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం మొదట్లో న్యూరో సర్జన్లను సంప్రదించాడు. అయితే అలా చేయడం చట్టరీత్యా నేరం అని వారు అంగీకరించ లేదు.. దీనితో యూట్యూబ్‌లో న్యూరో సర్జరీలకు సంబంధించిన వీడియోలు చూశాడు. ఇందులో భాగంగానే ఎలక్ట్రికల్ షాప్‌లో ఓ డ్రిల్లింగ్ మెషీన్‌ను కొనుగోలు చేశాడు. తలలో ఉంచేందుకు ఒక ఎలక్ట్రోడ్ చిప్‌ను కూడా తీసుకున్నాడు. డ్రిల్లింగ్‌ మెషీన్ సాయంతో వీడియో చూస్తూ.. తన తలకు తానే రంధ్రం చేసుకున్నాడు. నేరుగా కపాలానికి రంధ్రం చేశాడు. అనంతరం ఆ చిప్‌ను మెదడు వద్ద అమర్చాడు. అయితే ఈ పనిచేస్తుండగానే తల నుంచి తీవ్రంగా రక్తం కారిపోయింది. ఏకంగా అతడే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. నాలుగు గంటలపాటు సర్జరీ అయితే చేసుకున్నాడు కానీ చాలా రక్తం పోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చివరికి ఆస్పత్రిలో చేరి.. ప్రాణాలతో బయటపడ్డాడు.

కాస్త కుదురుకున్నాక ట్విట్టర్‌లో ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నాడు. తాను ఒక ప్రత్యేక ప్రయోగం చేశానని, కానీ చాలా రక్తాన్ని కోల్పోయి దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చానని పేర్కొన్నాడు. ఇప్పటికీ పరిస్థితి ఏం బాగోలేదని, ఈ ప్రమాదకరమైన పనిని ప్రయత్నించవద్దని ఇతరులను హెచ్చరించాడు.

అయితే తను పెట్టుకున్న ఈ చిప్ నిద్రలో కలలు వచ్చినపుడు మెదడు కదలికలు, ఇతర వాటిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించాడు. ఇలాంటి ప్రయోగం ఇదే మొట్ట మొదటిసారి అని మిఖాయిల్ వెల్లడించాడు. ఈ ప్రయోగం విజయవంతమైతే కలల నియంత్రణ సాంకేతికతలకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నాడు.

Tags:    

Similar News