Thailand PM : థాయ్ ప్రధానిగా షినవత్రా.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Update: 2024-08-19 12:30 GMT

థాయ్ ల్యాండ్ దేశ ప్రధానిగా పే స్టార్న్ షినవత్రా ఎన్నికయ్యారు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె. 37 ఏళ్ల వయసులో ప్రధాని పదవికి ఎన్నికైన దేశంలోని అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కారు. ఆమె అత్త యింగ్లక్ తర్వాత ప్రధాని పదవిని చేపట్టిన రెండవ మహిళ కావడం విశేషం.

ఎన్నికల్లో పోటీ చేయకుండానే నేరుగా ప్రధానమంత్రి అయ్యారు షినవత్రా. ప్రధానమంత్రి పదవికి పేటోంగ్ టర్న్ త్రా ఒక్కరే బరిలో నిలిచారు. పార్లమెంటులో ఆమెకు అనుకూలంగా 310 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 145 మంది సభ్యులు ఓటు వేశారు. 27 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనలేదు. మాజీ ప్రధాని త్రేతా తదిసిన్ రాజ్యాంగ న్యాయస్థానం ద్వారా తొలగింపునకు గురైన రెండు రోజుల తర్వాత షినవత్రా ఎంపిక జరిగింది. వీరిద్దరూ ఫ్యూ థాయ్ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.

థాయ్ ల్యాండ్ ప్రధానిగా ఎన్నికైన షినవత్రాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభా కాంక్షలు తెలిపారు. పదవీకాలం విజయవంతంగా నిర్వహించాలని మోడీ ఆకాంక్షించారు.

Tags:    

Similar News