అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లైంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్‌తో పాటు అమెరికాకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే.
వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సియాటెల్ జడ్జి ఆదేశాల ప్రకారం ఆ ఆర్డర్ దేశ వ్యాప్తంగా 14 రోజుల పాటు అమలు కాదు. అలాగే, విచారణ సమయంలో జడ్జి మాట్లాడుతూ ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధమైందని బార్‌లోని సభ్యుడు నిస్సందేహంగా ఎలా చెప్పగలరో అర్థం కావడం లేదన్నారు. ఇది తన మనసును కలవరపెడుతోందని చెప్పారు.