Bangkok : బ్యాంకాక్ లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి...

Update: 2025-07-29 10:15 GMT

విదేశాల్లో జరుగుతున్న కాల్పుల ఘటనలు పర్యాటకుల నే కాదు...అక్కడ నివసిస్తున్న భారతీయులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దుండగుల కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బ్యాంకాక్‌లో జరిగిన ఇలాంటి ఘటన లో ఐదుగురు మృత్యు వాత పడ్డారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ఓ మార్కెట్ లోకి ప్రవేశించిన అగంతకుడు కాల్పులకు తెగ పడడంతో అక్కడ భయంకరం అయిన వాతావరణం ఏర్పడింది.

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కాల్పులు కలకలం రేపాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలోనీ.. ఓర్ టు కో మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగ పడ్డాడు. అనంతరం తన ను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన లో నలుగురు సెక్యూరిటీ గార్డుల తో పాటు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటనతో అప్రమత్తం అయిన పోలీసులు...ప్రజలు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా గత కొన్నేళ్లుగా బ్యాంకాక్‌లో దాడులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం థాంగ్ జిల్లాలోని ఒక పాఠశాల సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందడం గమనార్హం.

Tags:    

Similar News