Trump vs Harvard Issue: విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ కీలక హెచ్చరికలు

క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు;

Update: 2025-05-27 07:00 GMT

 అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులు, అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను  రద్దు చేస్తూ.. వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌ సహా యూఎస్‌లో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

చదువుకోవడానికి అని అమెరికాకు వెళ్లి విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొట్టినా వీసాలు రద్దు చేస్తామని  హెచ్చరించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం  మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డ్రాపౌట్‌ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా.. మీ విద్యార్థి వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’ అని యూఎస్‌ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.

Tags:    

Similar News