ఈ సంవత్సరపు చివరి సంపూర్ణ సూర్యగ్రహణం .. భారత్‌లో రాత్రి 7:03 గంటలకు

Update: 2020-12-14 10:37 GMT

ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం జరగనుంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచ దేశాలు చూడబోతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదు. దక్షిణ అమెరికా, చిలీ, అర్జెంటినా ప్రజలకు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, అంటార్కిటికాలో కూడా సూర్యగ్రహణం కనిపించనుంది. అలాగే పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల్లో ఉన్న నౌకల నుంచి కూడా ఈ సూర్యగ్రహణం బాగా కనిపిస్తుంది.

ఇవాళ్టి సూర్యగ్రహణం 5 గంటలపాటు ఉంటుంది. భారత్‌లో మాత్రం రాత్రి ఏడు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 12 గంటల 23 నిమిషాలకు ముగుస్తుంది. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు సంభవించాయి. వచ్చే ఏడాదిలో కూడా రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. 2021, జూన్ 10న మొదటి సూర్యగ్రహణం జరగనుంది. ఇది ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఉత్తర కెనడా, గ్రీన్ ల్యాండ్, రష్యాలలో కనిపించనుంది. భారత్‌లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. 2021లో రెండో సూర్యగ్రహణం డిసెంబరు 4న ఏర్పడనుంది. ఇది అంటార్కిటికా, దక్షిణ ఆఫ్రికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలలో కనిపించనుంది.


Tags:    

Similar News