Iran–Israel : రణరంగంలా పశ్చిమాసియా.. యుద్ధం ఇప్పట్లో ఆగదా..?

Update: 2026-03-04 06:15 GMT

పశ్చిమ ఆసియా రణరంగంలా మారిపోయింది. భీకర యుద్ధంతో బాంబుల మోత మోగుతోంది. డ్రోన్లు, మిస్సైళ్ల దాడితో అట్టుడికిపోతోంది. ప్రజలు కంటి మీద కునుకు లేకుండా వణికిపోతున్నారు. ఏ క్షణం ఎక్కడి నుంచి బాంబులు పడుతాయో అని దద్దరిల్లిపోతున్నాయి పశ్చిమాసియా దేశాలు. ఇజ్రాయెల్, ఇరాన్, కువైట్, దుబాయ్, సౌదీ, ఒమెన్, యెమన్, లెబనాన్ దేశాల్లో వార్ పీక్స్ కు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్ మీద భీకర దాడులు చేస్తున్నాయి. అటు ఇరాన్ కూడా తగ్గేదే లే అన్నట్టు రెచ్చిపోతోంది. తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలపై బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఆ దేశాలు దాడులతో అట్టుడికిపోతున్నాయి. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటిస్తోంది. ఇరాన్ పై మరింత భీకరంగా దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి.

ఇరు ప్రత్యర్థి దేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టు దూసుకెళ్తున్నాయి. ఇరాన్ దూకుడు పెంచింది. గల్ఫ్ దేశాలపైనే కాకుండా.. ఇతర దేశాలపై కూడా దాడులు చేస్తోంది. అమెరికాకు ఎవరు మద్దతుగా ఉంటే ఆ దేశం మీద విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియా దేశాలు ఎప్పుడు తమపై బాంబులు పడుతాయో అని వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఆయా దేశాల మీద యుద్ధం ఎఫెక్ట్ పడుతూనే ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆయా దేశాల అధినేతలతో మాట్లాడి భారతీయుల భద్రత గురించి తెలుసుకున్నారు.

ఇండియన్స్ ఎక్కడున్నా భద్రతా నియమాలు పాటించాలని.. యుద్ధం ముగిసే దాకా జాగ్రత్తగా ఉండాలని భారత్ సూచిస్తోంది. బంకర్లలో దాక్కోవాలని ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టు దూసుకుపోతున్నాయి కాబట్టి.. యుద్ధం మరింత భీకరంగా మారుతోంది తప్ప.. తగ్గినట్టు అస్సలు కనిపించట్లేదు. ఇంకొన్ని వారాల పాటు యుద్ధం ఉంటుందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం ఇంకో నాలుగు వారాల పాటు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News