లిబియాలో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన శ్రీకాకుళం కార్మికులు
లిబియాలో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన శ్రీకాకుళం కార్మికులు స్వస్థలానికి చేరారు. లిబియాలో సెప్టెంబర్ 14న ఏడుగురు భారతీయ కార్మికుల కిడ్నాప్ కాగా..;
లిబియాలో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన శ్రీకాకుళం కార్మికులు స్వస్థలానికి చేరారు. లిబియాలో సెప్టెంబర్ 14న ఏడుగురు భారతీయ కార్మికుల కిడ్నాప్ కాగా... ఇందులో ముగ్గురు శ్రీకాకుళం వాసులు ఉన్నారు. వీరిని కిడ్నాపర్లు 28రోజుల పాటు చీకటి గదిలో బంధించారు. కార్మికుల కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు... విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లారు. లిబియాతో విదేశాంగశాఖ సంప్రదింపులు జరపడంతో... కార్మికులు విడుదలయ్యారు. కిడ్నాపర్ల చెర నుంచి విడిపించడంలో కృషి చేసిన రామ్మోహన్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.