PAkisthan PM Ulak : రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి : PoKకు ప్రభుత్వం సూచన
పీవోకే ప్రజలకు ప్రధాని ఉలాక్ పిలుపు భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగే సంకేతాలు కన్పిస్తుండటంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను అక్కడి స్థానిక ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రెండు నెలలకు సరిపడా ఆహారం, ఔషధాలు సహానిత్యావసరాలు సమకూర్చుకోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా భారత సరిహద్దుల్లోని 13 నియోజకవర్గాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ విషయాన్ని పీఓకే ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హఖ్ స్వయంగా స్థానిక అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించారు. 3.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అత్యవసర నిధిగా సమకూర్చి నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడి పత్రికలు కూడా పేర్కొన్నాయి. భారత్ దాడి చేస్తుందన్న భయంతో పీఓకే మీదుగా విమానాల రాకపోకలను పాకిస్తాన్ నిలిపివేసిన తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం చేసుకోవాలంటూ భారత్కు ప్రపంచ దేశాలనుంచి సలహాలు, సూచనలు వస్తున్న నేపత్యంలో ఆ ప్రాంతంపై భారత్ దాడి చేయవచ్చని పాకిస్తాన్ భయపడుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.