Talibans : తాలిబన్ల కొత్త రూల్.. స్టైలిష్ కటింగ్స్, షేవింగ్స్ ఇక బంద్!
Talibans : తాము మారిపోయామంటూనే తమ పాత పద్ధతిలోనే పాలనను కొనసాగిస్తున్నారు తాలిబన్లు.. తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.;
Talibans : తాము మారిపోయామంటూనే తమ పాత పద్ధతిలోనే పాలనను కొనసాగిస్తున్నారు తాలిబన్లు.. తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా మరో అవసరంపై కూడా వారు నిషేదం విధిస్తున్నట్లుగా ప్రకటించారు. దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్ షేవ్‌ను చేసుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినట్లుగా వెల్లడించారు.
లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదని వారు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షించబడుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా షాపులలో ఆద్యాత్మిక పాటలు తప్ప మరే పాటలు కూడా వినిపించకూడదని హకుం జారీ చేశారు.
1996 నుండి 2001 వరకు తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఆడంబరమైన కేశాలంకరణను నిషేధించారు. పురుషులు గడ్డాలు పెంచాలని ఆదేశించారు. చూస్తుంటే తాలిబన్లు మళ్ళీ పాత ధోరణిలోనే వారి పాలనను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.