అమెరికా ఉద్యోగుల్లో ఎలెన్ మస్క్ గుబులు పట్టుకుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన అధ్య క్షుడు ట్రంప్ ఈన విజయా నికి కృషి చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామ స్వామిలకు ఎఫిషియెన్సీ శాఖ అప్పగించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, నింబధనల సడలింపు, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలను వీరిద్దరూ నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందే నలుగురు అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ ఎలెన్ మస్క్ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమను భయపెట్టేం దుకే మస్క్ ఈ తరహా వ్యూహాలను అమలు చే స్తున్నారా..? అనే చర్చ మొదలైంది. ఈ విషయా లను ఉన్నతాధికారులు బహిరంగంగానే షేర్ చేసుకుంటుండటం గమనార్హం. ఎలెన్ మస్క్ బాధ్యతలు చేపడితే పరిస్థితి ఎలా ఉంటుందోననే గుబులు అధికారులను వెంటాడుతోంది.