Tesla Cyber Truck: లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ ముందు పేలిన టెస్లా సైబర్ ట్రక్..
ప్రమాదంలో ఒకరు మృతి.. మరో ఏడుగురికి గాయాలు..;
అమెరికాలోని లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించాగా.. ఏడుగురు గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే, న్యూ ఆర్లీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో దాదా15 మంది మరణించారు.
ఈ రెండు ఘటనలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ పేలుడుకు గల కారణమైన రెండు కార్లను టూర్ రెంటల్ వెబ్ సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. బహుశా రెండు ఘటనలకు సంబంధం ఉండొచ్చని ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించింది.. టెస్లా వాహనం వల్ల కాదని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అలాగే, ఈ ఘటనపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందని తెలిపారు. రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఎఫ్‌బీఐ విచారణ చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
ఇక, న్యూ ఆర్లీన్స్ ఘటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. మన దేశంలో వలసల కారణంగా వస్తున్న నేరస్థుల సంఖ్య అధికంగా ఉందని హెచ్చరించా.. నా మాటలను డెమోక్రాట్లు, యూఎస్ మీడియా ఖండించాయని ఆయన పేర్కొన్నారు. నేను చెప్పింది నిజమేనని తాజా ఘటనతో తేలింది.. గతంలో కంటే అమెరికాలో క్రైమ్ రేట్ ప్రస్తుతం పెరిగింది.. ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం తెలియజేస్తున్నాం.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు.