పార్లమెంట్‌లో నీలిచిత్రాలు చూస్తూ దొరికిపోయిన ఎంపీ
థాయ్‌లాండ్ ప్రభుత్వం తలదించుకునే ఘటన ఆ దేశ పార్లమెంట్‌లో చోటుచేసుకుంది;
థాయ్‌లాండ్ ప్రభుత్వం తలదించుకునే ఘటన ఆ దేశ పార్లమెంట్‌లో చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఓ సిగ్గు చేటైన ఘటన చోటు చేసుకుంది. సభలో ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సమయంలో అధికార పార్టీ ఎంపీ రోన్నతెప్ అనువాత్ నీలి చిత్రాలు చూస్తూ మీడియా కంటపడ్డాడు. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఈ దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు. సుమారు పది నిమిషాల పాటు నీలి చిత్రాలు చూసినట్టు మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తాను నీలి చిత్రాలు చూస్తున్నట్టు మీడియా ముందు ఆయన అంగీకరించారు. అయితే ఎందుకు చూడాల్సి వచ్చిందని అడిన ప్రశ్నకు ఓ విచిత్రమైన కారణం చెప్పారు. చిత్రాల్లో ఉన్న మహిళ సాయం చేయాలని ప్రాదేయపడుతుందని.. అయితే, అది నిజమో, అబద్దమో తెలుసుకునేందుకు వాటిని పరిశీలగా చూశానని తెలిపారు. కొంతమంది గ్యాంగ్‌స్టర్లు ఆమెను వేధింపులకు గురిచేస్తూ ఫొటోలు తీస్తున్నట్లుగా ఆ ఫొటోల్లో ఉన్నదని అనువాత్ చెప్పారు. అందుకే ఆమె ఏమైనా ప్రమాదంలో ఉందేమోనని ఆ ఫొటోలను పరిశీలించానని తెలిపారు.