దుబాయ్ లో SIIMA 13వ ఎడిషన్.. దుబాయ్: దక్షిణ భారత సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 13వ ఎడిషన్ కోసం దుబాయ్ సిద్ధమవుతోంది.ఈ సంవత్సరం SIIMA అవార్డు వేడుకలకు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల హాజరవుతున్నారు. వీరిలో కమల్ హాసన్, అల్లు అర్జున్, శివకార్తికేయన్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, కార్తీ, రష్మిక మందన్న, త్రిష, ఉన్ని ముకుందన్, ఉపేంద్ర, దునియా విజయ్, మీనాక్షి చౌదరి, ఆషిక పంగునాథ్, పూర్వతి తిరువోలు, తేజ సజ్జ.. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.
సైమా అవార్డులతోపాటు స్టార్-స్టడెడ్ లైనప్ ప్రదర్శనలు ఆహుతులను అలరించనున్నాయి. ముఖ్యంగా శ్రుతి హాసన్, శ్రియ శరణ్, వేదిక, శిల్పా రావు, ఊర్వశి రౌతేలా, సానియా అయ్యప్పన్, అమృత లియంగార్ - ది బి-యూనిక్ క్రూ డ్యాన్స్ ట్రూప్ ప్రదర్శనలు హై ఓల్టేజీని సృష్టించనున్నాయి.
SIMA ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ.. దక్షిణ భారత సినిమా సరిహద్దులు దాటిందన్నారు. SIIMA ప్రపంచ వేదికపై ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. మన సౌతిండియా సినిమా వేడుకలకు దుబాయ్ ఏకైక వేదికగా కొనసాగుతోందని, ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకలతో వస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం సైమా వేదికపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. SIIMA తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదని తెలిపారు. ఇది కేవలం అవార్డు వేడుక కాదని, అంతకంటే ఎక్కువ అని, తాము ఒకే కుటుంబంగా కలిసి వచ్చే గొప్ప సినిమా పండుగ అని, అభిమానుల కోసం సైమా వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి దుబాయ్‌కి రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
సైమా సినీ వేడుకలు ఎక్స్‌పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో సెప్టెంబర్ 5న తెలుగు మరియు కన్నడ అవార్డుల కార్యక్రమం, సెప్టెంబర్ 6న తమిళ్ మరియు మలయాళ సినిమా అవార్డుల కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి టిక్కెట్లు ఇప్పుడు ప్లాటినమ్‌లిస్ట్ https://dubai.platinumlist.net/event-tickets/100967/siima-awards-2025 లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 'ట్రక్కర్స్' సంస్థ లోకల్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ట్రక్కర్స్ సంస్థ అధినేత విశాల్ మహాజన్ మాట్లాడుతూ "మూడో సారి సైమా ను దుబాయ్ లో హోస్ట్ చేయటం సంతోషం గా ఉంది. ప్రతి ఏడాది సినీ అభిమానులకు మరపురాని అనుభూతిని అందించటంలో ఎల్లప్పుడూ కృషి చేస్తాం" అని అన్నారు.