West Asia War Escalates : యుద్ధంలోకి రష్యా, చైనా..? భారత్ మీద ఎఫెక్ట్..!
పశ్చిమాసియా యుద్ధం వారం రోజులకు చేరుకుంది. మొదలైన రెండు మూడు రోజులకే పూర్తవుతుందని అంతా అనుకున్నారు కానీ.. యుద్ధం ఇంకా కొనసాగడం అంటే దాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఇరాన్ వెనక రష్యా ఉందని.. ఆయుధపరంగా సాయం చేస్తోంది కాబట్టే.. తమ యుద్ధ విమానాల మీద క్షిపణులతో ఇరాన్ దాడి చేయగలుగుతుంది అంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. రాజకీయపరంగా ఇరాన్ మీరా దాడిని ఖండించాం గానీ.. ఆయుధ పరంగా, సైనిక పరంగా ఎలాంటి సాయం చేయట్లేదు అని తెలిపింది. అటు ఇరాన్ వాడుతున్న ఆయుధాలు పూర్తిగా చైనావే అని అమెరికా మరో ఆరోపణ చేస్తోంది. రీసెంట్ గానే భారత సముద్ర జలాల్లో ఇరాన్ కు చెందిన నౌకను అమెరికా ముంచేసింది. భారత సముద్ర జలాల్లోకి వచ్చి మరీ యుద్ధం చేయడం అంటే.. అమెరికా ఆలోచన విధానం ఏంటో అందరికీ క్లియర్ గా అర్థమవుతోంది.
ఈ యుద్ధంలోకి రష్యా, చైనాను లాగాలని ట్రంప్ చూస్తున్నారు. అందుకే పదేపదే రష్యా, చైనా పేరు ఎత్తుతున్నారు. అటు ఖతర్ ఒక సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుందని.. దానివల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుందని చెప్పింది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాల్లో ఇండియా, చైనా, జపాన్, మలేషియా లాంటిది ఉన్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఈ దేశాలకు ఆయిల్ లో ఎగుమతి చేసే నౌకలను పేల్చేస్తామని ఇరాన్ చెబుతోంది. అమెరికా కావాలనే ఈ విషయంలో సైలెంట్ గా ఉంటున్నట్లు కనిపిస్తోంది.
చైనా, ఇండియా, జపాన్ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడితే అది రాజకీయంగా తనకు కలిసి వస్తుంది అని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ దేశాల విషయంలో ఆయన తటస్థంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ దేశాలు కూడా యుద్ధంలోకి దిగాలని భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం ఈ దేశాల్లో ఏర్పడాలని ట్రంపు భావిస్తే ఖచ్చితంగా ఆయా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. అప్పుడు వార్ లోకి ఎంటర్ ఇచ్చే దేశాల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ఇప్పటికే 20 దేశాలు ఈ వార్ లోకి ఎంట్రీ ఇచ్చేసాయి. మరి ట్రంప్ కోరుకుంటున్నట్టు ఈ దేశాలు కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాయా లేదా తటస్థంగా వ్యవహరిస్తాయా అనేది చూడాలి.