Helen Storm America: అమెరికాలో హెలెనా తుఫాన్ బీభత్సం..

52 మందికి పైగా మృతి;

Update: 2024-09-30 05:30 GMT

అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 హరికేన్‌ ‘హెలెనా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా సౌత్‌ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, నార్త్‌ కరోలినా, వర్జినీయా రాష్ర్టాల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. గంటకు 140 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హరికేన్‌ గురువారం రాత్రి తొలుత ఫ్లోరిడాలోని బిగ్‌బెండ్‌ ప్రాంతాన్ని తాకింది. ఆ తర్వాత పలు రాష్ర్టాల్లో విధ్వంసం సృష్టించింది. వేలాదిమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఐదు రాష్ర్టాల్లోని 3.5 మిలియన్ల మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. టెన్నెస్సీలోని ఓ దవాఖానను వరదలు ముంచెత్తడంతో 54 మందిని అధికారులు రక్షించారు.

జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, టెనప్సీ గుండా సాగిన హపరికేన్ దాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రకృతి విపత్తు కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు చెప్పారు. అనేక మందికి వరద ముప్పు పొంచి ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

Tags:    

Similar News