టైటానిక్ షిప్ శిథిలాలను చూడడానికి వెళ్లి అదృశ్యమైన జలాంతర్గామి
అంట్లాంటిక్ మహాసముద్రంలోని ఏ ప్రాంతంలో ఈ జలాంతర్గామి అదృశ్యమైందన్నది కూడా తెలియలేదు.;
టైటానిక్ షిప్ శిథిలాలను చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి అదృశ్యమైంది. అయితే, ప్రమాద సమయంలో అందులో ప్రయాణికులు ఉన్నారా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అంతేకాకుండా అంట్లాంటిక్ మహాసముద్రంలోని ఏ ప్రాంతంలో ఈ జలాంతర్గామి అదృశ్యమైందన్నది కూడా తెలియలేదు. మరోవైపు, దీన్ని గుర్తించేందుకు బోస్టన్ కోస్ట్ గార్డు అధికారులు ప్రత్యేక బృందాలను సముద్రంలోకి పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
విలాసవంతమైన టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహా సముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయింది. ఈ ఘటనలో 15వందల మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఆ తర్వాత నుంచి కొంతమంది ఔత్సాహికులు, పరిశోధకులు జలాంతర్గాములతో అక్కడికి వెళ్లి శిథిలాలను చూసొస్తున్నారు. తాజాగా అలా చూసేందుకు వెళ్తున్నప్పడే జలాంతర్గామి అదృశ్యమైనట్లు తెలుస్తోంది.