లాస్ఏంజెలిస్ లో నిర్వహించిన ఓ వేలంలో ఓ టోపీ 6,30,000 డాలర్లు (సుమారు రూ.5.28 కోట్లు) ధర పలికింది. ఇంతకీ ఈ టోపీ విశేషమేమిటంటే... ఇండియానా జోన్స్ సిరీస్ లోని 'టెంపుల్ ఆఫ్ డూమ్' హీరో హారిసన్ ఫోర్డ్ ఈ టోపీ ధరించాడు.
దీనిని లండన్లోని 'హెర్బర్ట్ జాన్సన్' టోపీ కంపెనీ తయారు చేసింది. టోపీ లోపల లైనింగ్ 'ఐజే' (ఇండియానా జోన్స్) అనే బంగారపు అక్షరాలున్నాయి. దీంతో ఈ వేలంలో స్టార్ వార్స్, హ్యారీ పోటర్, జేమ్స్ తదితర పాపులర్ సినిమాల్లో ఉపయోగించిన వస్తువులనూ విక్రయించారు.
'రిటర్న్ ఆఫ్ ది జేడ్'లో వినియోగించిన హెల్మెట్ 3,15,000 డాలర్లు (రూ.2.64 కోట్లు)కు అమ్ముడైంది.