TikTok Layoffs: ఉద్యోగులకు టిక్​టాక్​ బిగ్​ షాక్

700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన;

Update: 2024-10-11 23:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొలువుల కోత భయాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లేఆఫ్స్‌ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత మాంద్యం భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఐ  కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్‌ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుమారుగా 700 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌లకు సంబంధించిన ఇ-మెయిల్స్‌ అందినట్లు తెలుస్తోంది. అయితే, టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌  బైతేడాన్సు మాత్రం ఈ లేఆఫ్స్‌ ప్రభావం 500 కంటే తక్కువ మంది ఉద్యోగులపైనే చూపిందని స్పష్టం చేసింది.

ఈ ఏడాది మేలో కూడా టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా కంటెంట్, మార్కెటింగ్ విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి. త్వరలోనే మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగనున్నట్లు సమాచారం. ఇక టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Tags:    

Similar News