Trump : ట్రూడో రాజీనామా: బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్!

Update: 2025-01-07 10:45 GMT

కెనడాపై డొనాల్డ్ ట్రంప్ ప్రెజర్ పెంచుతూనే ఉన్నారు. మరోసారి అమెరికాతో విలీన ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. ‘USలో 51వ స్టేట్‌గా ఉండటాన్ని చాలామంది కెనడియన్లు ప్రేమిస్తున్నారు. మేమిక భారీ వాణిజ్య లోటు, సబ్సిడీల భారం మోయలేం. ఇది తెలిసే ట్రూడో రాజీనామా చేశారు. కెనడా అమెరికాలో విలీనమైతే టారిఫ్స్, ట్యాక్సులు తగ్గిపోతాయి. రష్యా, చైనా నుంచి సురక్షితంగా ఉండొచ్చు. కలిసిపోతే గొప్ప దేశంగా ఎదగొచ్చు’ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కెనడా, చైనా, మెక్సికోలపై 25 శాతం సుంకం వడ్డిస్తామని ప్రకటించారు. తర్వాత ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్‌లో కెనడా ప్రధానితో ట్రంప్‌ భేటీ అయ్యారు. అక్రమ వలసలు, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ విషయంలో చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్‌ హెచ్చరించారు. ఒకవేళ, విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్‌ ఆఫ్‌ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

Tags:    

Similar News