శాంతిదూతగా తనని తాను ప్రదర్శించుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. మొన్నటి వరకు 7 యుద్ధాలు ఆపానని.. ఇప్పుడు 3 యుద్ధాలే ఆపినట్లు చెప్పారు. ‘ఒకటి 31 ఏళ్లుగా కొనసాగుతొంది, అందులో కోటిమంది చనిపోయారు. ఇంకొకటి 34 ఏళ్లు, మరొకటి 37 ఏళ్లుగా కొనసాగుతున్నవి’ అని టెక్ సంస్థల CEOలకు ఇచ్చిన విందులో పేర్కొన్నారు. అయితే ఏ దేశాల మధ్య అనే విషయాన్ని ప్రస్తావించలేదు.
మరోవైపు US రక్షణశాఖ (పెంటగాన్)ను ఇక నుంచి యుద్ధశాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)గా పిలవాలని ట్రంప్ ఆదేశించారు. ‘డిఫెన్స్ సెక్రటరీ’ని ‘వార్ సెక్రటరీ’గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నిజానికి ఆ దేశ రక్షణశాఖ 1789-1947 మధ్య డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌గా ఉండేది. ఆ తర్వాత రక్షణ శాఖగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత పేరు పెట్టారు. ప్రత్యర్థులకు తమ యుద్ధ సన్నద్ధతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.