Trump Frustration : బానిసల పిల్లల కోసం తెస్తే అంతా ఎగబడుతున్నారు : ట్రంప్
బానిసల పిల్లల కోసం తొలినాళ్లలో తెచ్చిన జన్మత: పౌరసత్వపు హక్కు కోసం ప్రపంచమంతా ఎగబడుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యంగంలో 14వ సంవతరణ ద్వారా జన్మత: పౌరసత్వం అమల్లోకి వచ్చింది. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. దీనిపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఒకసారి గతాన్ని గుర్తుచేసుకుంటే.. బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారని చెప్పారు. అంతేగానీ.. ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో పోగుపడటం కోసం ఆ చట్టాన్ని తేలేదన్నారు. చాలామంది అమెరికా వస్తున్నారని, అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తోందని అన్నారు. ఈ చట్టం చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకొచ్చిందంటూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ చెప్పారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు.