Trump : అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

Update: 2025-04-17 07:30 GMT

అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

అమెరికా-చైనాల మధ్య సుంకాల యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం 145 శాతం నుంచి 245 శాతానికి పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు అమెరికాలో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు విపరీతంగా నష్టపోతాయి. కాగా అమెరికా వస్తువులపై చైనా 125% టారిఫ్స్ విధిస్తోంది.

Tags:    

Similar News