U.S : ట్రంప్​ విజయం..ఎలన్​ మస్క్​ జోరు

Update: 2024-11-08 10:00 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద గురువారం ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది. ట్రంప్ ఎన్నికతో యూఎస్ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ధోరణి కనిపించింది. టెస్లా షేర్లు పుంజుకున్నాయి. టెస్లా షేర్లు 14.75 శాతం వృద్ధి చెంది 288.53 డాలర్ల వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 290 బిలియన్ డాలర్లకు పెరిగింది. 300 బిలియన్ డాలర్ల మార్కుకు అత్యంత చేరువలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఎలన్ మస్క్ సంపద 60 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ఎలన్ మస్క్ విస్తృత ప్రచారం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (మాజీ ట్విట్టర్)ను వినియోగించారు. తన మద్దతుదారులు, అభిమానుల నుంచి 120 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. ఫ్లోరిడాలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఎలన్ మస్క్ ఒక స్టార్ అని అభినందనల్లో ముంచెత్తారు.

Tags:    

Similar News