Japan : జపాన్ లో ట్విట్టర్ కిల్లర్ ఉరితీత

Update: 2025-06-28 10:45 GMT

జపాన్ లో సుమారు మూడేండ్ల తర్వాత మరణశిక్ష అమలు చేశారు. 'ట్విట్టర్ కిల్లర్'గా పేరున్న టకాహిరో షిరాయిషిని ఉరి తీసినట్లు ఆ దేశ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది. టకాహిరో.. ట్విట్టర్లో సూసైడు సంబంధించిన పోస్టులు పెట్టే యువతనే టార్గె ట్ గా చేసుకునేవాడు. బాధను తనతో పంచుకో మంటూ మాటల కలిపి.. స్నేహం చేసేవాడు. అనంతరం ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగించేవాడు. ఆ తర్వాత తన అపార్టుమెంట్ కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తు వులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు. ఇలా ఏకంగా మందిని కర్కశంగా హత్య చేశాడు. వారిలో 26 ఏండ్ల లోపు 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పోలీసులు 2017లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2020లో ఈ సీరియల్ కిల్లర్కు టోక్యో కోర్టు ఉరిశిక్ష విధించింది. తాజాగా అతడికి మరణ శిక్ష విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News