TSUNAMI: ఆ మహా ప్రళయానికి రెండు దశాబ్దాలు

ప్రశాంత నగరాన్ని పెను విషాదంగా మార్చిన సునామీ...నేటికి తలచుకున్న భయాందోళనలే;

Update: 2024-12-26 10:15 GMT

ప్రశాంత తీరాన్ని పెను విషాదంగా మార్చిన సునామీకి నేటితో 20 ఏళ్లు. 2004 DEC 26న ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1-తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ వచ్చింది. ఫలితంగా శ్రీలంకలో దాదాపు 35,000 మంది, భారతదేశంలో 16,389 మంది, థాయిలాండ్‌లో 8,345 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ విపత్తుకు 82 మంది బలైపోయారు. అయితే, డాల్ఫిన్ నోస్ వలయంగా నిలవడంతో విశాఖ వాసులు సేవ్ అయిపోయారు. ఈ సునామి దాటికి కేవలం ఇండోనేషియాలోనే లక్ష 70 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమత్ర దివుల్లో శకలాలు మాత్రమే మిగిలాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే 107, కేరళ 177, తమిళనాడులో 8009, పాండిచ్చేరిలో 599, అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 3513 మంది మృత్యువాత పడ్డారు.

డిసెంబర్‌ 26, 2004లో వచ్చిన సునామీ ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఇప్పటికీ ఆ రాకాసి అలలు తమ కళ్ల ముందే మెదలాడుతున్నాయని.. ఆ భయానక దృశ్యాలు గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన ఎక్కువవుతుందని అప్పటి సునామీ బాధితులు ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలల విధ్వంసానికి ఎత్తైన భవనాలు సైతం క్షణాల్లో నేలకూలిపోయాయి. అప్పట్లో హిందూ మహా సముద్రంలో ఎలాంటి హెచ్చరిక వ్యవస్థ లేదు. దీని వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. థాయిలాండ్‌లోని సముద్ర తీర హోటళ్లు, రిసార్ట్‌లకు వచ్చిన టూరిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ప్రసిద్ధ దేవాలయాలు, స్టేడియం వంటివి కూడా ఈ సునామీ ధాటికి కుప్పకూలిపోయాయి. కేవలం తమిళనాడు నాగపట్టణంలోనే 6 వేల మందికి పైగా మరణించారు.

5లక్షల మందికిపైగా!

ఇండొనేషియా నుంచి భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్ సహా అనేక దేశాల్లో సముద్రతీరాల వెంబడి ఎటుచూసినా విధ్వంసమే కనిపించింది. సునామీ సంభవించిన ఇండొనేషియాలో లక్షా 70 వేల మందికిపైగా మృత్యు అలలకు బలయ్యారు. ఐదు లక్షల 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని అతే ప్రావిన్స్‌పై సునామీ పెను ప్రభావం చూపింది. 23 జిల్లాల్లో 18 తీరప్రాంతంలోనే ఉండగా సుమారు 85వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇండోనేషియా తర్వాత శ్రీలంకపై సునామీ తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 40వేల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నాటి విపత్తులో ప్రాణాలతో బయటపడినవారు 20 ఏళ్ల నాటి విధ్వంసాన్ని తలచుకుని ఇప్పుటికీ కుమిలి పోతున్నారు. ఇటు భారత్‌లోనూ సునామీ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. అండమాన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకూ. అధికారిక లెక్కల ప్రకారమే 15వేల 749 మంది మరణించారు. 5వేల 640 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వేలాది మంది సర్వం కోల్పోయారు.

Tags:    

Similar News