Air India Plane Crash: ఎయిరిండియా, బోయింగ్‌పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న యూకే ఫ్యామిలీలు..

మెరుగైన పరిహారం కోసం పిటిషన్ల దాఖలు చేసే అవకాశం..;

Update: 2025-07-01 09:00 GMT

గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతో పాటు, నేలపై ఉన్న 34 మంది వ్యక్తులు మరణించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన 30 సెక్షన్లలోపే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 181 మంది భారతీయులు మరణించగా, 52 మంది యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు చెందిన వారు ఉన్నారు.

అయితే, ఈ ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికులు కుటుంబాలు ఎయిర్ ఇండియా, బోయింగ్ సంస్థలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పిటిషన్లు దాఖలు చేయడానికి యూకేకి చెందిన న్యాయ సంస్థ కీస్టోన్ లాతో సంప్రదింపులు జరుగుతోంది. మెరుగైన పరిహారం కోరడం గురించి పిటిషన్లు దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, బాధితులకు ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ బాధితులకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి పరిహారాన్ని ప్రకటించింది. తక్షణ అవసరాలను తీర్చడానికి ఆయా కుటుంబాలకు రూ. 25 లక్షల అదనపు పరిహారాన్ని అందించింది. అయితే, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలతో కీస్టోన్ లా చర్చలు జరుపుతున్నట్లు అంగీకరించింది.

Tags:    

Similar News