UK PM Liz Truss : పొరపాట్లను క్షమించండి: బ్రిటీష్ ప్రధాని లిజ్ ట్రస్
UK PM Liz Truss : ప్రధానిగా అధికారం చేపట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే వ్యతిరేకత.. కారణాలు అన్వేషించి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.
UK PM Liz Truss : ప్రధానిగా అధికారం చేపట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే వ్యతిరేకత.. కారణాలు అన్వేషించి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.
తన కొత్త ఛాన్సలర్ జెరెమీ హంట్ తన మొత్తం పన్ను తగ్గింపు ఎజెండాను తిప్పికొట్టిన తర్వాత మొదటిసారి మాట్లాడిన ట్రస్, తప్పులు జరిగాయని సోమవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, తదుపరి సాధారణ ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీని నడిపిస్తానని పట్టుబట్టారు. ఇటీవలి రోజుల్లో తన పార్టీలో తిరుగుబాటు స్వరాలు పెరుగుతున్నందున, టోరీ నాయకురాలు తన ఆర్థిక వృద్ధి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు.
"మేము తప్పులు చేశామని నేను గుర్తించాను. ఆ పొరపాట్లను క్షమించండి, ఆ తప్పులను సరిదిద్దుకుంటాను "అని ట్రస్ అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కుంటోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం దేశ ఆర్థిక పరిస్థితిపై చాలా ప్రభావాన్ని చూపుతోందని అన్నారు.