Afghanistan: ఉక్రెయిన్ విమానం హైజాక్..
Ukraine plane hijacked:కాబుల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్ అయింది.;
కాబుల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్ అయింది. ఆఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ ప్రజలను తీసుకొచ్చేందుకు ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను పంపించారు. అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్‌కు పట్టుకుపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆయుధాలతో విమానం ఎక్కిన కొందరు గత ఆదివారం నాడు తమ విమానాన్ని హైజాక్ చేశారని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారని, వారి పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం మిస్టరీగానే ఉందని చెబుతున్నారు.