Ukraine : రష్యాపై యుక్రెయిన్ షాక్.. మెరుపు దాడుల్ని ఎలా ప్లాన్ చేశారంటే?

Update: 2025-06-02 10:45 GMT

రష్యాపై యుక్రెయిన్ భీకరమైన దాడి చేసింది. ఈ దాడుల్ని ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ద్వారా చేపట్టింది. దీనికి పావుటినా లేదా స్పెడర్ వెబ్ అని పేరుపెట్టింది. రష్యాకు చెందిన దీర్ఘశ్రేణి వైమానిక లక్ష్యాల్ని దెబ్బతీయడమే దీని లక్ష్యం. దాదాపు ఏడాదిన్నర కిందటే ఆపరేషన్ స్పైడర్ కు ప్లాన్ వేశారు. కార్గో ట్రక్ లపై చెక్క షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ షెడ్ల నిర్మాణంలోపల ప్రత్యేక బాక్స్ లో డ్రోన్లను దాచివుంచారు. అవసరమైనప్పుడు ఈ ట్రక్కుల పైకప్పులు రిమోట్ గా తెరుచుకుంటాయి. ఆ వెంటనే డ్రోన్లు ఆకాశంలోకి ఎగురుతూ లక్షిత వైమానిక స్థావరాలను ధ్వంసం చేస్తాయి. తాజా ప్రణాళికలో డ్రోన్ల సమూహంతో కూడిన డ్రోన్లను వ్యూహాత్మకంగా సరిహద్దులు దాటించిన కీవ్, శత్రుదేశ వైమానిక స్థావరాలపైకి డ్రోన్లను ఉసిగొల్పింది. రష్యా మాదిరిగా శక్తివంతమైన, విస్తారమైన క్షిపణి సామర్థ్యాలు లేని ఉక్రెయిన్, డ్రోన్ల వ్యవస్థ పై ఆధారపడింది. గతంలోనూ ఈ వ్యవస్థతోనే రష్యన్ సైనిక, చమురు సౌకర్యాలపై దాడులకు ఉపయోగించింది.

Tags:    

Similar News