United States : H-1బీ వీసా ఇంటర్వ్యూపై అమెరికా కీలక ప్రకటన

United States : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయం పెరుగుతున్న వేళ..హెచ్‌ 1-బి, ఎల్‌-1, ఓ-1 వీసాల జారీలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-12-24 12:00 GMT

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయం పెరుగుతున్న వేళ..హెచ్‌ 1-బి, ఎల్‌-1, ఓ-1 వీసాల జారీలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కాన్సులెట్‌లో వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. స్టూడెంట్‌, అగ్రికల్చర్‌, నాన్-అగ్రికల్చర్‌ లేబర్‌ వీసాలకు ఇది వర్తించనుంది. ఈ మినహాయింపు 2022 డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉండనుంది. ఐతే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులెట్‌ అధికారులు ఇన్‌ పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశం కల్పించింది. సంబంధిత వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడూ పరిశీలించాలని సూచించింది

Tags:    

Similar News