US-China : అమెరికా ఆంక్షలు... చైనా వార్నింగ్

Update: 2025-04-22 12:45 GMT

తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే ఏ ఒప్పందాన్ని కూడా ఇతర దేశాలు అమెరికాతో చేసుకోవద్దని చైనా హెచ్చరించింది. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ట్రంప్ సర్కార్ భయపెడుతున్న వేళ ఆయా దేశాలు అగ్రరాజ్యంతో రాజీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సుంకాల తగ్గింపు కోసం పలు దేశాలు తమతో చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది. తమ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఉండే ఒప్పందాలను తాము తీవ్రంగా వ్యతి రేకిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇవాళ స్పష్టం చేసింది. తమకు నష్టం కలిగేలా ఎవరు ఒప్పందం చేసుకున్నా ఊరుకొనేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా టారిఫ్ నుంచి ఉపశమనం కలగాలంటే చైనాతో ఆర్థిక సంబంధాలు కట్ చేసుకోవాలని అమెరికా ఆంక్షలు పెట్టిందని వస్తున్న వార్తల నేపధ్యంలో చైనా వార్నింగ్ ఇచ్చింది.

Tags:    

Similar News