అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ముందు వాషింగ్టన్ డీసీలోని సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

Update: 2021-01-20 16:15 GMT

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ముందు వాషింగ్టన్ డీసీలోని సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దీంతో అధికారులు సుప్రీంకోర్టు భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారు. అదే వాషింగ్టన్ నగరంలోని క్యాపిటల్ భవంతిలో మరికాసేపట్లో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. సతీమణితో కలిసి బైడెన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాగా భారత కాలామానం ప్రకారం రాత్రి 10.30గంటలకు క్యాపిటల్‌ హిల్‌ భవనంలో జో బైడెన్‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు.

Tags:    

Similar News