Kamala Haris: యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌కి తప్పిన ప్రమాదం..

యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్కిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయింది.

Update: 2021-06-07 05:53 GMT

Kamala Haris: యుఎస్ వైస్ కమలా హారిస్ ఎక్కిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయింది. విమానం వాషింగ్టన్ శివార్లలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సాంకేతిక లోపం గుర్తించి వెంటనే ల్యాండ్ చేశారు. దీంతో కమలా హారిస్‌కి అతి పెద్ద ప్రమాదం తప్పింది.

కమల తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం గ్వాటెమాలాకు వెళ్లేటప్పుడు సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన వెంటనే ల్యాండ్ అవ్వవలసి వచ్చింది.

ఫ్లైట్ దిగి కిందికి వస్తూ "నేను బాగున్నాను, నేను బాగున్నాను" అని హారిస్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మరో విమానంలో ఉపాధ్యక్షురాలు ఆదివారం సాయంత్రం ఆమె గ్వాటెమాలకు సురక్షితంగా చేరుకుందని పూల్ రిపోర్ట్ తెలిపింది. ఆమె ప్రయాణంలో పెద్ద జాప్యం జరగలేదని ఆమె ప్రతినిధి సిమోన్ సాండర్స్ తెలిపారు.

ఈ వారం హారిస్ గ్వాటెమాల మరియు మెక్సికోలను సందర్శిస్తారు. కోవిడ్ -19 ప్రభావంతో దెబ్బతిన్న ఆ ప్రాంతాలను సందర్శిస్తున్నారు హారిస్. ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు వెళుతున్నారు. వలసలకు మూల కారణాలను పరిష్కరించే దిశగా అధ్యక్షుడు జో బిడెన్ డిప్యూటీగా హారిస్ తన మొదటి పర్యటనను చేపట్టారు.

Tags:    

Similar News